Mon Mar 16 2026 00:31:34 GMT+0530 (India Standard Time)
ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా ఇటీవల రద్దు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
పలు కీలక బిల్లులకు...
దీంతో పాటు పలు కీలక బిల్లులను ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేవమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికను ఇవ్వాలని కోరారు. శాఖల వారీగా ఆదాయం, ఖర్చులను కూడా తమకు అందించాలని పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
Next Story

