Sat Mar 21 2026 03:18:55 GMT+0530 (India Standard Time)
14న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 14వ తేదీన జరగనుంది. అదే రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 14వ తేదీన జరగనుంది. అదే రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కీలక బిల్లులను...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పద మూడు రోజుల పాటు జరిగే అవకాశముందని తెలిసింది. అయితే బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో ఈనెల 28న విచారణ జరగనుంది. విచారణలో కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టే అవకాశముంది.
Next Story

