Fri Dec 05 2025 20:25:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది

ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నెలకు రెండుసార్లు జరపాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నిర్ణయించిన తర్వాత వరసగా నెలలో రెండుదఫాలు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 సాయంత్రంలోపు ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వర్షాకాల సమావేశాలపై...
ఈ సమావేశంలో అమరావతి రాజధాని భూముల సేకరణపై పురోగతిపై చర్చించే అవకాశముంది. అలాగే బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఆగస్టు నెల రెండో వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరపాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

