Tue Jan 20 2026 23:16:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.పలు అంశాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా అమరావతిలో భూమి కేటాయింపులను కొన్ని సంస్థలకు చేస్తూ మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
భూ కేటాయింపులపై...
పదమూడు సంస్థలకు గతంలోజరిగి భూ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు వచ్చే సంక్షేమ పథకాల అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఈ మేరకు అన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనలను పంపాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ అధికారులను ఆదేశించారు.
Next Story

