Fri Dec 05 2025 23:50:36 GMT+0000 (Coordinated Universal Time)
Ap Cabinet : ఏపీ కేబినెట్ భేటీలో అదే కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించింది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించింది. రైతుల సమస్యలపైనే మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో పంటల దిగుబడులు పెరిగాయని కేబినెట్ కు అధికారులు వివరిచంారు. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక పరిస్థితుల కారణంగా పంటల ధరలపై ప్రభావం చూపుతున్నాయని కూడా అధికారులు మంత్రివర్గ సభ్యులకు వివరించినట్లు తెలిసింది.
నష్టపోయిన రైతులకు...
ప్రధానంగా పొగాకు, మిర్చి, కోకో, చెరకు, మామిడి, ఆవ్వా రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడానికి గల కారణాలను కూడా అధికారులు వివరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రైతులను తమ ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని సమావేశంలో తెలిపారు. అకాల వర్షాల వల్ల కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారని చెప్పారు. అందరినీ ఆదుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో హామీ ఇచ్చినట్లు సమాచారం.
Next Story

