Wed Jan 21 2026 14:37:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం మంత్రి వర్గం సమావేశమై ఏపీ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
పూర్తి స్థాయి బడ్జెట్ ను...
దాదాపు 2.7 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముందని తెలిసింది. అయితే ఈరోజు ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించేది నిర్ణయిస్తారు. సుమారు పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రకటించింది.
Next Story

