Sun Mar 08 2026 15:08:09 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ ను కలవనున్న పురంద్రీశ్వరి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. కౌంటింగ్ మరో నాలుగు రోజులు ఉన్న సమయంలో పురంద్రీశ్వరి గవర్నర్ ను కలిసి కొందరు అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల విషయాన్ని ఆమె గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
రాజకీయ పరిణామాలతో పాటు...
గవర్నర్ తో జరిగే భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా పురంద్రీశ్వరి చర్చించనున్నట్లు తెలిసింది. కౌంటింగ్ ఏర్పాట్లు సజావుగా జరిగేలా చూసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ ను పురంధ్రీశ్వరి కోరనున్నారు. కొందరు కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై పురంద్రీశ్వరి ఫిర్యాదు చేస్తారని తెలిసింది.
Next Story

