Tue Feb 03 2026 13:20:15 GMT+0000 (Coordinated Universal Time)
సుజనా, సీఎం రమేష్ లతో కలసి....సోము వీర్రాజు?
అమరావతి రైతుల మహా పాదయాత్రలో నేడు ఏపీ బీజేపీ నేతలు పాల్గొంటున్నారు.

అమరావతి రైతుల మహా పాదయాత్రలో నేడు ఏపీ బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొననున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత ఇరవై రోజుల నుంచి రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో తాము పాల్గొంటామని బీజేపీ నేతలు ఇటీవలే ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో....
ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంద్రేశ్వరి, సత్యకుమార్ తదితరులు పాల్లొననున్నారు. అమిత్ షా ఆదేశాల మేరకు బీజేపీ నేతలు మహా పాదయాత్రలో పాల్గొంటున్నారు. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సోము వీర్రాజు కోరారు. ఈరోజు నుంచి అన్ని జిల్లాల నేతలు ఈ యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.
Next Story

