Sat Jan 24 2026 15:33:23 GMT+0000 (Coordinated Universal Time)
సోము వీర్రాజు అరెస్ట్ !
కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వేడుకలు చేయడానికి వెళ్తుంటే.. అరెస్ట్ చేయడం

కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై రాజకీయ వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంపై ఏపీలో రగడ జరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నేతలు గుడివాడ వెళ్తుండగా.. నందమూర వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. ఈ క్రమంలో.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read : వివాదంలో సింగర్ సునీత భర్త.. ఏం జరిగింది ?
గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్నకారణంగా అనుమతి లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వేడుకలు చేయడానికి వెళ్తుంటే.. అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తనపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో.. గుడివాడ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story

