Wed Mar 18 2026 06:10:22 GMT+0530 (India Standard Time)
BJP : నేడు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.
రాజమండ్రిలో...
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీని రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలన్న దానిపై నేడు నేతలు చర్చించున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేేసే దిశగా చర్యలపై పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాసవర్మతో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story

