Fri Dec 05 2025 18:07:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న వ్యాఖ్యలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారనుంది.
రాజీనామాలపై...
రాష్ట్ర పార్టీ నుంచి అనేక మంది నేతలు రాజీనామా చేసిన విషయాన్ని కూడా సోము వీర్రాజు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై వివరణ ఇవ్వనున్నారని తెలిసింది. ఒక వర్గం తనను టార్గెట్ చేసిన విధానంపై ఆయన మీడియా క్లిప్పింగ్ లు కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. తనను కావాలనే కొందరు లక్ష్యంగా చేసుకుని పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం సోము అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు ఈ నెల 16,17 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
Next Story

