Wed Dec 17 2025 15:51:47 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఢిల్లీకి పురంద్రీశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ పెద్దలను కలిసేందుకు ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖరారయిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులపై చర్చించడానికే పురంద్రీశ్వరి ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పోటీ చేసే స్థానాలపై...
ఏపీలో బీజేపీ ఆరు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ పదహారు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో పురంద్రీశ్వరి చర్చించనున్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలపై కూడా స్పష్టత రావడంతో ఆశావహుల జాబితాను తీసుకుని ఆమె ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. దీనిపై నేడు, రేపట్లో స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

