Fri Mar 27 2026 15:12:48 GMT+0530 (India Standard Time)
బీజేపీపై నిప్పులు చెరిగిన రోజా
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. బీజేపీ అసలు సంగతులను వదిలేసి కొసరు సంగతులతో ముందుకెళుతున్నట్లుందన్నారు. బీజేపీ, టీడీపీ ల పట్ల ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రోజా అన్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలను అమలు చేయకుండా బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు.
నవ్వుతున్నారు....
ఈ సమయంలో సభలు పెట్టి ఏం సాధిస్తారని రోజా బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆ సభను చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న బీజేపీ నేతల ఆరోపణలను రోజా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంగతేమిటని రోజా ప్రశ్నించారు.
Next Story

