Sat Dec 06 2025 09:45:18 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ముగియనున్నాయి. ఈరోజు ప్రభుత్వం శాసనసభలో తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ముగియనున్నాయి. ఈరోజు ప్రభుత్వం శాసనసభలో తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగ్ ఆడిట్ రిపోర్ట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభకు సమర్పించనున్నారు. ఈరోజు రైతు సమస్యలపై స్వల్ప కాలిక చర్చ జరిగే అవకాశముంది. శాసనసభ చివరి సమావేశాలు కావడంతో టీడీపీ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధమవుతుంది.
ఐదు రోజుల పాటు....
ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదు రోజుల పాటు సాగాయి. ఇందులో నాలుగు రోజుల పాటు టీడీపీ నేతలు సస్పెండ్ కు గురయ్యారు. ప్రతి రోజూ సభలో ఆందోళనకు దిగడం సభ నుంచి సస్పెండ్ కు గురికావడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో ఆందోళనకు ఎలాంటి అవకాశం లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

