Tue Apr 07 2026 01:00:17 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభను రెండు రోజుల పాటు వాయిదా వేశారు. శివరాత్రి కోసం రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి నుంచి తిరిగి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
మూడు కీలక బిల్లులను...
ఈరోజు ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభంకానున్న శాసనసభ తర్వాత జీరో అవర్ లో శాసనసభ్యులు లేవనెత్తిన సమస్యలకు మంత్రులు సమాధానం ఇస్తారు. ఈరోజు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేటి అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరరగనుంది.
Next Story

