Tue Jan 20 2026 18:15:42 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : 18 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. జగన్ వస్తారా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అనుమతించిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ విడుదల చేశారు. శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా, శాసనమండలి సమావేశాలు అదే ోజు పది గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే సమావేశాలను ఎన్ని రోజులు జరపాలన్నది ఇంకా నిర్ణయించలేదు.
పది రోజుల పాటు...
తొలి రోజు అసెంబ్లీ సమాశాల సమయంలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు జరపాలన్నది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం మాత్రం ఏడు లేకపోతే పది వర్కింగ్ డేస్ లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్ ల స్థానంలో బిల్లులను తీసుకు వచ్చే అవకాశముంది. అదే సమయంలోమరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేపెట్టనుంది. అయితే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. శాసనసభకు హాజరు కాకుంటే పులివెందుల ఉప ఎన్నిక జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలతో జగన్ రాకపై ఉత్కంఠ నెలకొంది.
Next Story

