Sat Dec 14 2024 16:25:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 11 నుంచి
ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.ఈ నెల 11న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండే అవాకశం ఉందని శాసనసభ అధికారులు తెలిపారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు...
అదేరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచిస్తుంది. ఈ నెలాఖరుతో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. బడ్జెట్తోపాటు కీలక బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీల అమలు గురించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం మెండుగా ఉంది. వీటికి బడ్జెట్ కేటాయించనున్నారని మంత్రులు చెబుతున్నారు.
Next Story