Tue Jan 20 2026 11:37:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు పదో రోజుకు అసెంబ్లీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటికి పదో రోజుకు చేరుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటికి పదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. ఈరోజు పీఏసీ తో పాటు మరో మూడు కమిటీల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే పీఏసీకి సంబంధించి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జనసేన నుంచి పులవర్తి ఆంజనేయులు నామినేషన్ లు దాఖలు చేశారు.
వివిధ నివేదికలను...
ఈరోజు 2047 విజన్ డాక్యుమెంట్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక సభకు సమర్పించనున్నారు. తర్వాత మంత్రి బిసి జనార్థన్ రెడ్డి డ్రోన్ పాలసీపై నివేదిక ఇవ్వనున్నారు. టూరిజం పాలసీపై కందుల దుర్గేష్ నివేదిక సభకు సమర్పించనున్నారు. పీఏసీ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ బ్యాలట్ పద్ధతిలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు.
Next Story

