Mon Mar 16 2026 12:23:41 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
భారీ బడ్జెట్ తో...
ఈసారి భారీగా బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఈ సమావేశాల్లోనే వ్యవసాయ శాఖ బడ్జెట్ ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజులు సమీక్ష జరిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు అనుమతులు లేవని తెలిపారు.
Next Story

