Tue Apr 07 2026 07:02:16 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం పది గంటలకు ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభను వాయిదా వేసి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు.
బీఏసీలో నిర్ణయించి...
బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహంచాలన్న దానిపై తేదీలను ఖరారు చేస్తారు. సభను ఎన్ని రోజులు జరపాలి? ఏ ఏ అంశాలపై చర్చ జరపాలి అన్నది కూడా బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. రేపు గగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మార్చి 12వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. మొత్తం పంధొమ్మిది పనిదినాలు సభను నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

