Sun Mar 15 2026 08:57:57 GMT+0530 (India Standard Time)
Ap Assembly : ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రారంభమయింది. గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం ప్రారంభమయింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రారంభమయింది. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రొటెం స్పీకర్ గా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం ప్రారంభమయింది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రులు వరసగా ప్రమాణ స్వీకారం చేశారు.
దైవ సాక్షిగా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా సభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ పసుపు కండువాలతో సభలోకి అడుగుపెట్టారు. అందరిచేత ఒక్కొక్కరిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. వరస క్రమంలో ఒక్కొక్కరిని పిలుస్తూ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Next Story

