Sat Mar 07 2026 15:05:20 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీ నిరవధిక వాయిదా.. బడ్జెట్ కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ చివరి రోజు సమావేశంలో బడ్జెట్ ను శాసనసభ ఆమోదించింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ చివరి రోజు సమావేశంలో బడ్జెట్ ను శాసనసభ ఆమోదించింది. బడ్జెట్ ను ఆమోదించిన వెంటనే స్పీకర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు అనేక సమస్యలను ప్రస్తావించారని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలకోసం తీసుకువచ్చిన చట్టాలకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ అన్నారు.
చివరి రోజున....
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము వెల్ఫేర్ క్యాలెండర్ ను విడుదల చేశామని, చంద్రబాబుకు అదే ఫేర్ వెల్ క్యాలెండర్ అవుతుందని అన్నారు. శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల్లో అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకుంది.
Next Story

