Tue Mar 17 2026 22:06:56 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో నేడు టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో ఇంటర్ మొదటి, ద్వితీయ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేడు టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం 11 గంటలకు...
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కాగా, 1.02 లక్షల మంది ప్రయివేటుగా రాశారని అధికారులు తెలిపారు. ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానుండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
Next Story

