Sun Mar 08 2026 05:49:33 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీలో టెన్త్ రిజల్ట్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేడు పదో తరగతి పరీక్షాఫలితాలు విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నేడు పదో తరగతి పరీక్షాఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీలో ఏప్రిల్ 18వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. వెంటనే వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ వెబ్సైట్లో...
ఫలితాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉండటంతో లక్షల మంది విద్యార్థులు టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు. టెన్త్ ఫలితాల కోసం http://www.bse.ap.gov.in/ వెబ్సైట్ లో వెళ్లి టెన్త్ రిజల్ట్ క్లిక్ చేయవచ్చు. ఈ ఫలితాలను ప్రింట్ తీసుకునే సౌకర్యం కూడా కల్పించారు. దీంతో పాటు manabadi.co.in వెబ్సైట్లో కూడా ఫలితాలను చూడవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Next Story

