AP Politics : ఇద్దరికీ అవసరమే.. కలసి పోటీ అనివార్యమే.. ఆ ప్రచారం అంతా బోగస్సే
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీతో కలసి వెళ్లడం అనివార్యం

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీతో కలసి వెళ్లడం అనివార్యం. వచ్చే ఎన్నికల్లోనూ కలసి వెళ్లడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కూటమిలో విభేదాలు అన్నది అవాస్తవం అని భావించాల్సి ఉంటుంది. ఇటీవల నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలతో భేటీ అయినప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేతలతో చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఎవరికీ చెప్పినట్టు విన లేదు. కానీ, తొలిసారి ఏపీలోని చంద్రబాబుతో కలిసిముందుకు సాగాలని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగానే ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా అధికారంలో ఉన్న మోడీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆదిశగా పార్టీనాయకులకు దిశానిర్దేశం చేయడం అంటే ఆనకు స్పష్టమైన నివేదికలు అంది ఉంటాయని భావిస్తున్నారు.

