Fri Mar 27 2026 18:44:05 GMT+0530 (India Standard Time)
నేడు అంబటి క్వాష్ పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది.

మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని అంబటి రాంబాబు పిటీషన్ వేశారు. ఈ కేసులో అంబటి రాంబాబు నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను దూషించిన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.
నగరం పాలెం కేసులో...
అయితే మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుపై ఈ నెల 22వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదయిన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటీషన్లను కూడా హైకోర్టు విచారణ చేసి మార్చి 2వ తేదవీకి వాయిదా వేసింది. నగరం పాలెం కేసు క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story

