Tue Jan 20 2026 15:24:59 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ, ఎమ్మెల్యే ఫ్లెక్సీలు తొలగింపు.. వైసీపీ ఎమ్మెల్యేయే కారణం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సొంత పార్టీకి చెందిన నేతలతోనే కాలుదువ్వుతున్నారు

అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అనంతపురం జిల్లా వైసీపీలో ఈ విభేదాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సొంత పార్టీకి చెందిన నేతలతోనే కాలుదువ్వుతున్నారు. పార్లమెంటు సభ్యుడు, విప్ ల ఫ్లెక్సీలను తొలగించారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది.
శివరాత్రికి...
శివరాత్రి సందర్భంగా కల్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి శివాలయంలో జరిగే కార్యక్రమాలకు ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిద్దరిని స్వాగతిస్తూ వారి అభిమానులు కల్యాణ దుర్గం నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసుల ద్వారా ఆ ఫ్లెక్సీలను తొలగించడం వివాదంగా మారింది. సొంత పార్టీకి చెందిన నేతల ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ పోలీసుల సహకారంతో తొలగించడంతో వైసీపీ లో విభేదాలు మరింత తీవ్రమయ్యాయనే చెప్పాలి.
Next Story

