Sun Dec 14 2025 00:22:11 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఎత్తైన మహిళ
తిరుమలకు అసాధారణ ఎత్తుగల మహిళ స్వామి వారి దర్శనానికి వచ్చారు

తిరుమలకు అసాధారణ ఎత్తుగల మహిళ స్వామి వారి దర్శనానికి వచ్చారు. దీంతో భక్తులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కూడా ఆమెను ఆసక్తిగా తిలకించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. నిన్న కూడా వేల సంఖ్యలో భక్తుుల స్వామివారిని దర్శించుకున్నారు. అయితే అందరిచూపు మాత్రం ఓ మహిళ పైకే వెళ్లింది.
అసాధరణ ఎత్తులో ఉండటంతో...
దానికి కారణం ఆమె ఎత్తు. అవును..ఆమె అసాధారణ ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ఈమె ప్రత్యేక ఆకర్షణగా కన్పించారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఈ మహిళ ఎత్తు దాదాపు ఏడు అడుగులు ఉందని చెబుతున్నారు. ఆమె మరెవరో కాదు, శ్రీలంక నెట్‌బాల్ స్టార్ తర్జిని శివలింగం. శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆమెను భక్తులు వీడియోలు, ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది కూడా ఆమెతో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు.
Next Story

