Fri Mar 06 2026 15:53:49 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం
ఈ రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం విజయవాడలో జరగనుంది.

ఈ రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం విజయవాడలో జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. విజయవాడ పటమట డొంక రోడ్లోని అంత్రా లూక్స్ ఫంక్షన్ హాలులో కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఆటల పోటీల్లో గెలుపొందిన...
ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతుల ప్రదానం చేయనన్నారు. కార్యక్రమంలో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సభ్యులతో కలిసి విందులో పాల్గొననున్నారు. సభ్యులు సాయంత్రం ఆరు గంటలకు ముందుగానే సభాప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.
Next Story

