Mon Mar 16 2026 03:54:39 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీలో కీలక సమావేశం
నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది

నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
మోదీ ఆదేశం మేరకు...
ప్రధాని మోదీ ఆదేశం మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ తరుపున విజయసాయిరెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి హాజరు కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.
Next Story

