Sat Dec 06 2025 03:55:53 GMT+0000 (Coordinated Universal Time)
సిరిమానోత్సవంలో అపశృతి.. కూలిన వేదిక
సిరిమానోత్సవంలో అపశృతి.. కూలిన వేదిక

విజయనగరంలో జరుగుతున్న పైడితల్లి సిరిమానోత్సవంలో ప్రమాదం తప్పింది. సిరిమానోత్సవం చూసేందుకు వీఐపీల కోసం ఏర్పాటు చేసిన వేదిక కుప్ప కూలింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమ కుటుంబ సభ్యులతో కలిసి సిరిమానోత్సవం చూసేందుకు హాజరయ్యారు. అయితే వేదిక మీద బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులుండగానే వేదిక కుప్ప కూలింది.
వేదికపై బొత్స కుటుంబం...
అయితే ఈ ఘటనలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఎవరికీ గాయాలు కాలేదు. కానీఒక ఎస్సైతో పాటు మరొక చిన్నారికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వేదికను ప్రభుత్వమే వేదిక ఏర్పాటు చేసింది. అయితే బొత్స కుటుంబ సభ్యులందరూ కూర్చోవడంతో పాటు వర్షం పడటంతో వేదిక కుప్పకూలింది. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, బొత్స అప్పల నరసయ్య కూడా వేదికపై ఉన్నారు. ఈ ఘటనలో వేదిక వెనక ఉన్న ఎస్సై సురేష్ కుమార్ కు గాయాలయ్యాయి. నాసిరకంగా ప్రభుత్వం వేదికను ఏర్పాటు చేయడంతోనే వేదిక కుప్పకూలిందని బొత్స కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Next Story

