Wed Jan 28 2026 21:56:38 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : ఒక రోజు ముందుగానే విజయవాడకు అమిత్ షా.. ఎందుకంటే?
రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే అమిత్ షా విజయవాడకు చేరుకోనున్నారు

ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ రానున్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే అమిత్ షా విజయవాడకు చేరుకోనున్నారు. ఆయన రాత్రి 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళతారు. అక్కడ చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతారు.
చంద్రబాబుతో సమావేశం....
రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో బీజేపీ నుంచి ఇద్దరికి రాష్ట్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను చంద్రబాబుకు అమిత్ షా అందచేయనున్నారు. దీంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించి రాత్రి 11 గంటల ప్రాంతంలో నోవాటెల్ హోటల్ కు వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రధానితో కలసి భువనేశ్వర్ బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

