Sun Mar 15 2026 13:24:34 GMT+0530 (India Standard Time)
పార్టీ నేతలతో అమిత్ షా మంతనాలు
రేపు అమిత్ షా తిరుపతిలోనే ఉండనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కానున్నారు.

రేపు కూడా అమిత్ షా తిరుపతిలోనే ఉండనున్నారు. రేపంతా పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు పార్టీ నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కానున్నారు. ఆ యా రాష్ట్రాల పరిస్థితులపై అమిత్ షా నేతలతో చర్చించనున్నారు. సదన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో తిరుపతి వచ్చిన అమిత్ షా పార్టీ నేతలతో కూడా భేటీ కావాని నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణ నేతలతో....
తొలుత తెలంగాణ నేతలతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, అక్కడ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నేతలతో కూడా బద్వేలు ఉప ఎన్నిక ఫలితంపై చర్చిస్తారని తెలిసింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేతలు తిరుపతికి చేరుకున్నారు.
Next Story

