Mon Apr 06 2026 22:04:41 GMT+0530 (India Standard Time)
అంబటి కుమార్తె మౌనిక శాపనానార్థాలు
అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యంచెప్పారు. త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని మౌనిక శాపనార్థాలు పెట్టారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష కట్టిందని, వరస కేసులు పెట్టి తన తండ్రిని జైలులు పెట్టిందని మౌనిక ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ...
త్వరలో కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ కామెంట్స్ చేశారు. తన తండ్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రతికూల పరిస్థితి నుంచి ఎదిగిన నాయకుడు వైఎస్ జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు ప్రతి కార్యకర్త, నాయకుడు ఆయనను స్పూర్తిగా తీసుకునేలా కూటమి వ్యవహరిస్తోందని అన్నారు.
Next Story

