Sat Feb 07 2026 19:06:35 GMT+0530 (India Standard Time)
అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి సారి ఎమ్మెల్యే అయిన గళ్లా మాధవికి అంత అహంకారమా? అని ప్రశ్నించారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని వచ్చిన పెమ్మసాని కలుషితం చేశారన్నారు. మళ్లీ దాడి చేస్తానని గళ్లా మాధవి అనడంలో ఆంతర్యమేంటని మౌనిక అన్నారు. పెమ్మసాని బురద రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని అన్నారు.
మాధవి, పెమ్మసానిపై ధ్వజం...
కార్యాలయానికి, ఇంటికి నిప్పు పెడితే పక్క నివాసంలో ఉన్న వారికి కూడా ఇబ్బంది కలగదా? అని మౌనిక ప్రశ్నించారు. పోలీసులు, రాజ్యాంగం, న్యాయస్థానాల కంటే మీరు పెద్దవారా? అని మౌనిక నిలదీశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎల్లకాలం అంగీకరించరని ఆమె తెలిపారు. వైసీపీ కాపు నేతలు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మౌనిక మీడియా సమావేశంలో మాట్లాడారు.
Next Story

