Wed Jan 14 2026 05:43:56 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో అంబటి డ్యాన్స్ లు అదరహో
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన పాటలకు డ్యాన్సులు చేసి అందరినీ అలరించారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు నుంచి తాను పోటీ చేస్తున్నానని, అందుకే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
తాను ఎక్కడుంటే అక్కడ...
తాను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటానని, అక్కడే డ్యాన్సులు చేస్తానని అంబటి రాంబాబు చెప్పారు. ఇక వైద్య కళాశాల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం పీపీపీ ద్వారా అనుమతులిచ్చిన జీవోలను భోగిమంటల్లో వేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు కొనసాగాలని నినాదాలు చేశారు. జీవోను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వం కుప్ప కూలుతుందన్నారు.
Next Story

