Sat Dec 06 2025 00:46:16 GMT+0000 (Coordinated Universal Time)
నేను చంద్రబాబు కాళ్లు పట్టుకోవడానికి కూడా రెడీ
తాను చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదని అంబటి రాంబాబు చెప్పారు

తాను చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదని అంబటి రాంబాబు చెప్పారు. తాను అన్నట్లు రుజువు చేస్తే చంద్రబాబు కాళ్లు కట్టుపట్టుకోవడానికి కూడా సిద్ధమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భువనేశ్వరి గారి పేరు గాని, ఆమె గురించి కాని ప్రస్తావన తేలేదని చెప్పారు.
కేవలం రాజకీయం కోసమే....
చంద్రబాబు కేవలం రాజకీయం కోసం, సభలో ఉండటం ఇష్టంలేకనే గొడవ పెట్టుకుని వెళ్లిపోయారని అంబటి రాంబాబు తెలిపారు. తాను అగౌరవంగా మాట్లాడనట్లు రుజువు చేస్తే చంద్రబాబు, భువనేశ్వరి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. లేనిపోని ఆరోపణలు చేయవద్దని ఆయన సూచించారు.
Next Story

