Wed Feb 18 2026 17:18:11 GMT+0530 (India Standard Time)
Breaking : అంబటి రాంబాబుకు రిలీఫ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ లభించింది

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ లభించింది. 2023లో నమోదయిన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. సంక్రాంతి సంబరాల పేరిట అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్ ను కొట్టివేసింది.
అన్ని కేసుల్లో బెయిల్ ...
అంబటి రాంబాబు ప్రస్తుతం ఈ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటి రాంబాబుపై మూడు పీటీ వారెంట్లు పోలీసులు వేశారు. మూడు కేసుల్లోనూ అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. చంద్రబాబును దూషించిన కేసులో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుతో పాటు సంక్రాంతి సంబరాల కేసులోనూ బెయిల్ వచ్చింది. అయితే మరొక పీటీ వారెంట్ దాఖలు చేయకపోతే అంబటి రాంబాబు నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
Next Story

