Sat Mar 07 2026 14:38:08 GMT+0530 (India Standard Time)
పిచ్చి వాళ్ళెవరూ లేరంటున్న అంబటి
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు

టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్)లో గురువారం ట్వీట్ చేశారు. పొత్తులపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నానన్న పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. 'కల్యాణ్ బాబూ... ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూలేరు' అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్పై విమర్శలు గుప్పించారు." జనసైనికులూ... ఆలోచించండి, ఊళ్లో పెళ్లికి కుక్కల హడవుడిలా లేదూ? అని ప్రశ్నించారు. అలాగే, ములాఖత్ గురించి ట్వీట్ చేస్తూ.. ఎప్పుడో చంద్రబాబుతో ములాఖత్ అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా" అని ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోరాడబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రబాబు నాయుడుతో ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని.. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని ఎదుర్కోవడం కష్టమే అని అన్నారు. రేపటి నుండి టీడీపీ-జనసేన కలిసి పని చేస్తాయని.. ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. రాష్ట్రం బాగుపడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చివరి వరకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
Next Story

