Thu Mar 12 2026 16:30:31 GMT+0530 (India Standard Time)
ఎన్ని కేసులైనా సిద్ధంగానే ఉన్నా : అంబటి
గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు

గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారన్న కేసులో కోర్టుకు హాజరయ్యారు. జనవరి 31న అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో గతంలో 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మాజీ మంత్రి. తర్వాత బయటకు వచ్చారు.
సమన్లు జారీ చేయడంతో...
అయితే విచారణ కోసం రావాలంటూ అంబటికి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. దీంతో నేడు న్యాయస్థానానికి హాజరయ్యారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తుందని, అయినా ఇలాంటి కేసులకు తాను భయపడబోనని, ఎన్ని కేసులయినా పెట్టుకోవచ్చని, తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు తెలిపారు.
Next Story

