Sat Mar 07 2026 23:19:36 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై ప్రశంసలు.. జగన్ పై విమర్శలు
అమరావతి రాజధానిని చంద్రబాబు ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

అమరావతి రాజధానిని చంద్రబాబు ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ నవ్యాంధ్ర నిర్మాణం చేయాలని చంద్రబాబు భావించారన్నారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా రాజధానిని రూపొందించారన్నారు. అంతిమ విజయం రైతులదే అవుతుందని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
రాజధాని అమరావతి.....
పాదయాత్ర చేసిన మహిళలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. మహాపాదయాత్రకు అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నా మొక్కవోని దీక్షతో పాదయాత్రను ముగించిన మహిళలకు హ్యాట్సాఫ్ అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏపీకి రాజధానిని లేకుండా చేసిందన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు అమరావతి రాజధానిగా ఉంటుందని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.
Next Story

