Thu Nov 30 2023 20:11:19 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతే ఏపీ రాజధాని.. కేంద్రం సంచలన ప్రకటన
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతిని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే..

ఏపీ రాజధాని అమరావతియే అని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతేనంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఏపీ విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 లతో రాజధాని అమరావతిని కేంద్రం ముడిపెట్టింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతి ఏర్పాటైనట్లు తెలిపింది. స్వతహాగా రాజధానిని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఏపీకి లేదని కేంద్రం చెప్పకనే చెప్పింది. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని, వాటికోసం చేసిన చట్టాలతో కేంద్రానికి సంబంధం లేదని తెలిపింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని, ఏపీకి అమరావతే రాజధానిగా పరిగణించబడుతుందని కేంద్రం తరపున హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు.
Next Story