Sun Mar 15 2026 11:55:22 GMT+0530 (India Standard Time)
నేడు 14 కి.మీ మేర పాదయాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్ర నేడు దోబిచెర్ల నుంచి ప్రారంభం కానుంది

అమరావతి రైతుల మహా పాదయాత్ర నేడు దోబిచెర్ల నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్ర నేటికి 22వ రోజుకు చేరుకుంది. ఈరోజు గోపాపురం నియోజకవర్గంలోని దోబిచెర్లలో ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నం నల్లజెర్ల వరకూ సాగుతుంది. అక్కడ భోజన విరామం కోసం ఆగుతారు. భోజన విరామం అనంతరం పాదయాత్ర బయలుదేరి రాత్రికి ప్రకాశరావుపాలెం వరకూ కొనసాగుతుంది. అక్కడే రాత్రికి బస చేయనున్నారు. నేడు పథ్నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించారు.
అన్ని పార్టీలు...
గత నెల 12వ తేదీన అమరావతిలో ప్రారంభమయిన రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. రైతులకు పెద్దయెత్తున స్వాగతం పలుకుతూ ఎక్కడికక్కడ మద్దతు తెలుపుతున్నారు. జనసేన, సీపీఐ, సీీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ సంఘీభావాన్ని తెలిపి రైతులకు అండగా నిలుస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

