Fri Dec 05 2025 17:40:59 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్ మధ్యనే సాగుతున్న రైతుల యాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్ర తణుకు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. పాదయాత్ర నేడు 30వ రోజుకు చేరుకుంది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర తణుకు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. పాదయాత్ర నేడు 30వ రోజుకు చేరుకుంది. ఈరోజు తణుకు మండలం వేల్పూరు నుంచి బయలుదేరి పైడిపర్రు, పాలంగి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి ఉండ్రాజవరంలో రైతులు బస చేయనున్నారు. ఈరోజు 16 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని రైతులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నిన్న కొంత టెన్షన్...
రైతుల మహాపాదయాత్ర సందర్భంగా నిన్న కొంత ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరు నినాదాలతో పాటు నల్ల బెలూన్లు, నల్ల కండువాలతో నిరసనలు తెలపడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. అయితే పోలీసులు ఇరు వర్గాలు ఘర్షణ పడకుండా పాదయాత్ర సజావుగా సాగేలా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. ఈరోజు కూడా భారీ బందోబస్తు మధ్య రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది.
Next Story

