Sun Mar 22 2026 15:22:44 GMT+0530 (India Standard Time)
నేడు భీమవరం నియోజకవర్గంలో మహాపాదయాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమయింది. నేడు 30వ రోజుకు పాదయాత్ర చేరుకుంది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమయింది. నేడు 30వ రోజుకు పాదయాత్ర చేరుకుంది. ఉండి నియోజకవర్గంలోని పెదమిరం నుంచి బయలుదేరి విస్సాకోడేరుకు మధ్యాహ్నానికి చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న అనంతరం బయలుదేరి రాత్రికి భీమవరం నియోజకవర్గం వీరవాసరానికి పాదయాత్ర చేరుకుంటుంది. ఈరోజు రైతులు పదిహేను కిలోమీటర్లు నడవాలని రైతులు నిర్ణయించారు.
గో బ్యాక్ అంటూ...
అయితే రైతులు గో బ్యాక్ అంటూ నినాదాలతో బ్యానర్లు కనపడుతున్నాయి. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఉద్రిక్తతల నడుమ రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు కూడా తమ ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.
Next Story

