Sun Mar 15 2026 11:54:02 GMT+0530 (India Standard Time)
పాదయాత్రకు మంచి స్పందన
అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమయింది. ద్వారకా తిరుమల నుంచి మహాపాదయాత్ర ప్రారంభమయింది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమయింది. ద్వారకా తిరుమల నుంచి మహాపాదయాత్ర ప్రారంభమయింది. ఈరోజు 15 కిలోమీటర్ల మేర ఈరోజు పాదయాత్ర చేయనున్నారు. దుర్గమ్మ వారి ప్రతిమలను తీసుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. రైతు జేఏసీ నాయకులు గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు.
అన్ని పార్టీలూ...
అమరావతి రైతుల మహా పాదయాత్ర 20వ రోజుకు చేరుకుంది. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ మహాపాదయాత్ర చేపట్టిన రైతులకు అన్ని పార్టీలూ సంఘీభావం తెలిపాయి. రోడ్డు మార్గాన ప్రజలు పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతిన ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అడుగడుగునా రైతులకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండటంతో ఉత్సాహంగా బయలుదేరారు.
Next Story

