Wed Mar 18 2026 08:01:38 GMT+0530 (India Standard Time)
ఆ 29 గ్రామాల వారే బాగుపడాలా?
అమరావతి రాజధాని రైతుల ఉద్యమంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని రైతుల ఉద్యమంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్టర్లు చేస్తున్న ఉద్యమంగా రైతుల పోరాటాన్ని ఆమె అభివర్ణించారు. తమ భూముల ధరలను పెంచుకోవడం కోసమే మహాపాదయాత్ర పేరిట డ్రామాకు తెరతీశారని రోజా ఫైర్ అయ్యారు. ఆ 29 గ్రామాలు తప్ప రాష్ట్రంలో ఏ గ్రామం అభివృద్ధి చెందకూడదా? దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయానికి గురికావా? అని రోజా ప్రశ్నించారు.
జగన్ పై విషం...
కేవలం తాము మాత్రమే బాగుండాలని కోరుకోవడం ఆ ప్రాంత ప్రజలు కోరుకోవడం దారుణమని రోజా ఫైర్ అయ్యారు. ముసుగులో ఉన్న కొందరు దొంగలు జగన్ పై విషం కక్కుతున్నారని రోజా ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చంద్రబాబుతో సహా అన్ని పార్టీలూ ద్రోహం చేస్తున్నాయని రోజా అన్నారు.
Next Story

