Fri Apr 10 2026 14:21:00 GMT+0530 (India Standard Time)
Amaravathi : "అమరావతి" అందుకోకపోతే తప్పు ఎవరిది?
అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది

అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడం, మావిగాన్ ప్రతిపాదన జగన్ తేవడం పై ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ మరొకవైపు అమరావతి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోయినా, అనుకోని రీతిలో అభివృద్ధి చెందకపోయినా అందుకు ప్రధాన కారణం చంద్రబాబు కాదు. మెయిన్ విలన్ నారాయణ అవుతారన్నది ఇప్పుడు టీడీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా...సింగపూర్..షాంగై..ప్యారీస్ ఇలా ప్రపంచ నగరాల్ల కడతామని అన్నా రైతులు మాత్రం నారాయణ వైపు వేళ్లు చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో...
ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చంద్రబాబు చెప్పినట్లు అమరావతి అతి పెద్ద నగరంగా నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. అప్పులతో ప్రభుత్వ భవనాలను అయితే నిర్మించవచ్చు. అదీ కూడా సరైన సమయానికి సాధ్యం కాదు. జనం లేని చోటకు పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామిక వేత్తలు ముందుకు రారు. ప్రజలతో సంబంధం లేని సంస్థలు మాత్రమే అక్కడకు వచ్చే అవకాశముంది. అమరావతి అనేది సహజ సిద్దంగా కాలంతో పాటు నగరమో..మహానగరమో అవ్వాలి కాని ఇప్పుడే ఏదో జరుగుతుందన్నది అత్యాశే అవుతుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు.
అన్నీ తానే అయి...
మంత్రి నారాయణ అన్నీ తానే రాజధాని అమరావతి విషయంలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. భూ సమీకరణ బాధ్యత కూడా మంత్రి నారాయణ పైనే పెట్టారు. ఊరూరా తిరుగుతూ గ్రామసభలు నిర్వహిస్తున్న సమయంలో రైతుల నుంచి ఎప్పుడు? ఎలా? అన్నది చెప్పాలని రైతులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. బలవంతపు భూ సేకరణ చేసినప్పటికీ అది వ్యతిరేకత తెచ్చిపెడుతుంది. ఇప్పటికే మంత్రి నారాయణపై రైతులు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు తమకు అనుకూలమే. కానీ నారాయణే పడనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం అమరావతి నిర్మాణ పనులు ఆలస్యమయితే మాత్రం అందుకు నారాయణ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది టీడీపీ నేతలే అంటున్నారు. మరి నారాయణ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతారా? లేదా? అన్నది చూడాలి. కానీ మంత్రి నారాయణ నిమిత్తుడేనని, ఆయన పైనుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే అమలు చేస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Next Story

