Fri Jan 24 2025 05:56:53 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి....?
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా మొన్నటి వరకూ గుడివాడ అమర్ నాధ్ రాజకీయంగా రాణించలేదు
![, gudivada amarnath, minister, new cabinet, andhra pradesh , gudivada amarnath, minister, new cabinet, andhra pradesh](https://www.telugupost.com/h-upload/2022/04/11/1348117--gudivada-amarnath-minister-new-cabinet-andhra-pradesh.webp)
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా మొన్నటి వరకూ ఆయన రాజకీయంగా రాణించలేదు. గుడివాడ అమర్ నాథ్ తండ్రి గురునాధరావు గతంలో మంత్రిగా పనిచేశారు. దాదాపు 31 ఏళ్ల తర్వాత గుడి వాడ ఇంటికి మంత్రి పదవి దక్కింది. 2007లో టీడీపీ నుంచి విశాఖ కార్పొరేటర్ గా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్నారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ విశాఖ పార్టీ బాధ్యతలను అప్పగించారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు. 2019 లో వైసీపీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా జగన్ గుడివాడ అమర్ నాధ్ ను కాపుకోటా కింద మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
Next Story