Sun Mar 08 2026 15:10:19 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కూటమి నేతలు భేటీ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కూటమి నేతలు భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నామని గవర్నర్ కు తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మూడు పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు వాళ్లు వివరించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు...
గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పురంద్రీశ్వరి ఉన్నారు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు.
Next Story

